BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో చాకలి ఐలమ్మ* చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు చాకలి ఐలమ్మ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామంలో 1895 సెప్టెంబర్ 26వ తారీకున ఓరుగంటి మల్లమ్మ సాయిలుకు నాలుగవ సంతానంగా జన్మించింది వీరిది వెనుకబడిన కుటుంబం కుల వృత్తే వారికి జీవనాధారం పాలకుర్తి కి చెందిన చిట్యాల నరసయ్యతో ఐలమ్మ వివాహం జరిగింది ఈ భూమి నాది పండించిన పంట నాది తీసుకెళ్లడానికి దొర ఎవ్వడు నా ప్రాణం పోయాకే పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటలుగా మలుచుకునే దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతన్న విప్లవన్ని చాకలి ఐలమ్మ మెరిసే విప్లవ దృవతార దొరల పెత్తనన్ని ఎదిరించిన ధీశాలి రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత తెలంగాణ సాయుధ పోరాటానికి దారి చూపిన వీరమాత ఆమె చరిత్ర తెలంగాణకి మరియు దేశానికి గర్వకారణం వారికి భూమి లేకపోవడం వల్ల మల్లంపల్లి కొండలరావు దగ్గర నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నారు వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్న వారి జీవితంలోకి పెత్తందార భూస్వాములు అడుగుపెట్టి వారి పంటలు దోచుకోవడానికి అరాచకం సృష్టించారు దొరలకు వంగి దండాలు పెట్టే రోజులలో శివంగిలా గర్జించింది.ఐలమ్మ ఆమె కొంగు నడుముకు చుడితే దొరతనం తోకముడిచింది ఆమె కొడవలి చేతబడితే పీడిత జనం కడలిలా తరలివచ్చారు ఆడదని అలుసుగా చూసిన కంట్లో నలుసు అయింది ఆమె తీయింపుతోనే వెట్టి చాకిరి ముగింపునకు వచ్చింది చివరకు సెప్టెంబర్ 10, 1985 సంవత్సరంలో చనిపోవడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, కె. సికిందర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి
10
Sep