BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి గారిచే ఉత్తమ ఉపాధ్యాయుడిగా పురస్కారాన్ని అందుకున్న ఎల్ బాలరాజ్ గౌడ్.
బాలరాజ్ గౌడ్ S/o ఎల్లయ్య ( ఎంఎస్సీ బీఈడీ ) వెన్నచెడ్ గ్రామంలో జన్మించి . పదవ తరగతి వరకు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కోస్గిలో మరియు శ్రీ అనంత పద్మనాభ డిగ్రీ కాలేజీలో డిగ్రీ..ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ పూర్తి చేశారు..
2000 సంవత్సరంలో మొదటగా దోమ మండలంలోని భట్లచందారం గ్రామంలో ఉపాధ్యాయుడిగా 2005 వరకు ఉన్నారు.. తర్వాత 2005 నుండి 2008 వరకు పెద్ద వార్వాల్ గ్రామంలో 2008 నుండి 2018 వరకు మండల రిసోర్స్ పర్సన్ గా వెన్నచెడ్ గ్రామంలో కొనసాగి ప్రస్తుతం 2018 నుండి రంగారెడ్డి పల్లి గ్రామంలో ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాడు..
