పలువురి నాయకుల కుటుంబ సభ్యులను పరామర్శించిన వేముల వీరేశం       

BB6 TELUGU NEWS ఉబ్బని శేఖర్ : ఇటీవల నార్కట్ పల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లింగాల రాములు అనారోగ్య కారణంతోమృతిచెందగా వారి కుటుంబ సభ్యులను ఆదివారం నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం కూడా అందజేశారు. షాపల్లి గ్రామం మాజీ సర్పంచ్ సిద్ధగోని స్వామి గౌడ్ సోదరి ఇటీవల అనారోగ్య కారణంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను కూడా ఆదివారం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు దూదిమెట్ల సత్తయ్య యాదవ్, జేరిపోతుల భరత్ గౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు బత్తుల ఉషయ్య, సట్టు సత్తయ్య, గడ్డం పశుపతి, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పాశం శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe