గోదావరి నది వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను అడిషనల్ కలెక్టర్ శ్రీ అరుణతో కలిసి పరిశీలిస్తున్న : ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

BB6 TELUGU NEWS CHANNEL  : Tirupati : రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా ,గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ స్థానిక పోలీస్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా, సురక్షితంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావడానికి అన్ని విభాగాల సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు సూచించారు.

అంతేకాకుండా నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన రోడ్డు సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, లైటింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు, అగ్నిమాపక వాహనాలు, శానిటేషన్, భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గణేష్ నిమజ్జన సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు తగిన బందోబస్తు కల్పించాలని, బహిరంగ ప్రదేశాలలో శుభ్రత మరియు భద్రత చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే గారు అన్నారు. భక్తులు ఆనందంగా, ప్రశాంతంగా ఉత్సవాన్ని పూర్తి చేసుకునేలా ప్రతి చిన్న విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related News

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe