విద్యతోనే సమాజంలో మార్పు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

BB6 Telugu NEWS CHANNEL:
తాండూరు మండలం జీనుగుర్తి గ్రామంలో ఏకలవ్య గ్రామీణ్ వికాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
సందీపని గురుకులం ఆవరణలో హాస్టల్ భవనము ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో కలిసి పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి….
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
మారుమూల ప్రాంతం అయిన జీన్ గుర్తి గ్రామంలో ఏకలవ్య గ్రామీణ్ వికాస్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవలు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది
విద్యను వ్యాపారం చేయకూడదనే ఉద్దేశ్యంతో కొనసాగుతున్న ఏకలవ్య ఫౌండేషన్ కు ఎల్లప్పుడూ తమ వంతు సహాకారం ఉంటుంది.
ధీర్ఘకాలిక లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ అతి తక్కువ సమయంలోనే భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతల నుండి ప్రముఖులను ఫౌండేషన్ ఒకే వేదిక పైకి తేచ్చింది.

భవిష్యత్తులో ఈ ప్రాంతం నుండి దేశానికి నాయకత్వం వహించే ఎంతో మంది నాయకులను,ఐఏఎస్ లను, శాస్త్రవేత్తలను,డాక్టర్స్ ను, లాయర్లను,అధికారులను,ఎంతో మంది ప్రముఖులు ఈ ప్రాంతం నుండి దేశానికి ఫౌండేషన్ అందించబోతుంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడ అందరికి విద్యను అందించాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్స్ పాఠశాల మన తాండూర్ లో పనులు ప్రారంభించడం జరిగింది.
యువతకు సాంకేతిక విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో మన తాండూర్ లో ఏటీసీ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది.
తాండూర్ కర్ణాటక సరిహద్దు ప్రాంతంతో పాటు దేశంలో వివిధ ప్రాంతల ప్రజలు ఈ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారు కావున, ఈ ప్రాంతంలో  కేంద్రియ విద్యాలయం మరియు నవోదయ విద్యాలయం ఏర్పాటుకు కృషి చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి గారికి తీసుకెళ్ళడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అధికారులు, ఏకలవ్య ఫౌండేషన్ విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe