BB6 TELUGU NEWS CHANNEL
5 వందల రూపాయల నోట్ల కట్టలే. ఐదు కాదు.. పది కాదు.. ఏకంగా 12 కోట్ల ఇండియన్ కరెన్సీ ఇది. కర్ణాటకలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సంబంధించిన 30 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన తనిఖీల్లో కోట్ల కొద్దీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇల్లీగల్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ బెట్టింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్రను ఈడీ అరెస్ట్ చేసింది. సిక్కింలోని గ్యాంగ్ టక్లో ఎమ్మెల్యే దొరికిపోయాడు.
ఈ ఎమ్మెల్యే, ఆయన సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేసిన ఈడీ అధికారులు 12 కోట్ల డబ్బు, 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 10 కేజీల వెండి ఆభరణాలు, నాలుగు లగ్జరీ కార్లను సీజ్ చేశారు. ఈ 12 కోట్ల డబ్బులో ఒక కోటి వరకూ ఫారెన్ కరెన్సీ కూడా ఉండటంతో అధికారులు విస్తుపోయారు. ఈ కేసులో 17 బ్యాంకు అకౌంట్లను, రెండు బ్యాంకు లాకర్లను కూడా ఈడీ ఫ్రీజ్ చేసింది. ఎమ్మెల్యే వీరేంద్ర సోదరుడు కేసీ నాగరాజ్, అతని కొడుకు ఎన్ రాజ్ పేరిట ఉన్న అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ను కూడా ఈడీ అధికారులు సీజ్ చేశారు. కేసీ తిప్పేస్వామి, పృథ్వీ ఎన్ రాజ్ దుబాయ్ నుంచి ఈ ఆన్ లైన్ గేమింగ్ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు ఈడీ గుర్తించింది.
ఎమ్మెల్యే ఈ కేసులో నేరుగా ఇన్వాల్వ్ అయినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. ఎమ్మెల్యే వీరేంద్రను అరెస్ట్ చేసి ప్రొసీడింగ్స్ ప్రకారం.. తొలుత గ్యాంగ్ టక్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఒక్క బెట్టింగ్ వ్యవహారమే కాదు గోవాలో సదరు ఎమ్మెల్యేకు ఐదు క్యాసినోలు కూడా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కింగ్ 567, రాజా 567, పప్పీస్ 003, రత్న గేమింగ్ పేర్లతో ఆన్ లైన్ బెట్టింగ్ సైట్స్ ను ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర నడిపిస్తున్నట్లు ఈడీ తనిఖీల్లో వెల్లడైంది. దుబాయ్ లో తన సోదరుడు కేసీ తిప్పేస్వామి ఎమ్మెల్యేకు చెందిన డైమండ్ సాఫ్టెక్, టిఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్ 9టెక్నాలజీస్ చూసుకుంటున్నాడు. ఈ మూడూ కూడా గేమింగ్ బిజినెస్కు చెందిన కాల్ సెంటర్లుగా దర్యాప్తులో తేలింది….
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో దొరికిన 12 కోట్ల ఒరిజినల్ క్యాష్..దొంగ నోట్లు కాదు.

23
Aug