BB6 TELUGU NEWS CHANNEL
అక్రమ సంబంధాలు ఎన్నో ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.. భార్య భర్తలు.. ఒకరి ప్రాణాలు మరోకరు తీసుకునే స్థాయికి దిగజారడంతోపాటు.. దారుణాలకు పాల్పడుతున్నారు.. ముఖ్యంగా పరాయి వ్యక్తి మోజులో కట్టుకున్న భర్తలను.. భార్యలు హత్య చేయిస్తున్న ఘటనలు ఇటీవల నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. ప్రియుడి కోసం ఓ మహిళ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపింది..
అక్రమ సంబంధాలు ఎన్నో ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.. భార్య భర్తలు.. ఒకరి ప్రాణాలు మరోకరు తీసుకునే స్థాయికి దిగజారడంతోపాటు.. దారుణాలకు పాల్పడుతున్నారు.. ముఖ్యంగా పరాయి వ్యక్తి మోజులో కట్టుకున్న భర్తలను.. భార్యలు హత్య చేయిస్తున్న ఘటనలు ఇటీవల నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. ప్రియుడి కోసం ఓ మహిళ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపింది.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకుని 15 ఏళ్లుగా అన్యోన్యంగా ఉన్న వారి కుటుంబంలో.. వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. ప్రియుడితో కలిసి ఓ వివాహిత భర్తను హత్య చేసిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెంకట నరసింహపురంలో చోటుచేసుకుంది.. వివరాల ప్రకారం.. లక్ష్మణ్, పావని 15 ఏళ్ల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో.. లక్ష్మణ్, పావని వెంకట నరసింహపురంలో అద్దెకు ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కాగా.. వారితో కలిసి నివాసం ఉంటున్నారు. చక్కగా సాగిపోతున్న ఇద్దరి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు సమీప బంధువు ప్రదీప్..
ప్రదీప్‌కు పావనితో ఏర్పడిన పరిచయం, చనువు కాస్త.. వివాహేతర సంబంధంగా మారింది. దీంతో వారిద్దరూ కొంత కాలంగా భర్త లక్ష్మణ్ కు తెలియకుండా గుట్టుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మణ్ కు అనుమానం వచ్చింది. దీంతో పావనిని ప్రశ్నించాడు.. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి..
ఏం జరిగిందో ఏమో.. తెలీదు కానీ ఈనెల 13వ తేదీన నరసింహపురంలో లక్ష్మణ్ విగతజీవిగా పడి ఉన్నాడు. బార్య పావని ఏమి తెలియనట్లు హడావుడిగా చింతకుంట గ్రామంలో అంత్యక్రియలు జరిపించింది. అయితే భార్య వ్యవహారపై శైలిపై అనుమానం వచ్చిన భర్త తరపు బంధువులు ఆరా తీశారు.. ఈ క్రమంలోనే.. పావని – ప్రదీప్ మధ్య ఉన్న సంబంధం బయటపడింది..
అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తానే ప్రియుడు ప్రదీప్ తో కలిసి హత్య చేసినట్లు పావని ఒప్పుకుంది. ఈ ఘటనపై లక్ష్మణ్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి ప్రదీప్ – పావనిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేశామని.. పోస్టుమార్టం నిర్వహించేందుకు మృతదేహాన్ని వెలికితీస్తామని పోలీసులు వెల్లడించారు.
కొత్త లవర్ కోసం భర్తను లేపేసిన భార్య.. ఎక్కడో కాదు మన దగ్గరే..

21
Aug