BB6 TELUGU NEWS : Andhra Pradesh
నెల్లూరు: రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్టు చేశారు. నిడిగుంట అరుణను అద్దంకి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకొని కోవూరు పోలీసు స్టేషన్ కు తరలించారు. కోవూర్ లో ప్లాట్ యజమానిని బెదిరించిన కేసులో అరెస్టు చేశారు. నేడు ఆమెను కోర్టులో హాజరు పరచనున్నారు. నాలుగు రోజుల క్రితం సీఐకి ఫోన్ చేసి అరుణ బెదిరించారు. హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. జగన్ ప్రభుత్వ హయాంలో శ్రీకాంత్ సహకారంతో పలు నేరాలు, సెటిల్మెంట్లు చేశారు. అరుణ పూర్తి వ్యవహారాలపై పోలీసులు, నిఘావర్గాలు దర్యాప్తు చేపట్టాయి.
రౌడీషీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్టు చేశారు

20
Aug