BB6 TELUGU NEWS 17 Aug 2025 :
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఓ బాలికను పోలీసులు రక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొని ఇంటికి వెళ్తున్న 8వ తరగతి విద్యార్థిని ఓ వ్యక్తి అపహరించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన పోలీసులు వెంటనే 2 గంటల వ్యవధిలో అపహరించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. తండ్రి బాకీ చెల్లించకపోవడంతో నిందితుడు బాలికను అపహరించినట్లుగా విచారణలో పోలీసులు గుర్తించారు. ఎస్పీ బాలికతో మాట్లాడి అవగాహన కల్పించారు.


