BB6 TELUGU NEWS 11 Aug 2025 :
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య మాట్లాడుతూ ఒకటి నుండి 19 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వేయాలి దీంతో విద్యార్థుల్లో రక్తహీనత తగ్గించడంతోపాటు శారీరక మానసిక పెరుగుదల ఉంటుందని వివరించారు పిల్లలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఎటువంటి వ్యాధులు రావని ఒకటి నుండి ఐదు ఏండ్ల పిల్లలకు అర్థమాత్ర ఆరు నుండి పందొమ్మిది ఏళ్లవారికి పూర్తి మాత్ర పంపిణీ చేయాలి. ఆల్బెండజోల్ మాత్రను నమిలి మింగాలని దీనివలన ఎటువంటి ఇబ్బంది ఉండదని తర్వాత స్థానిక ఆశ వర్కర్ కావలి మంజుల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను వేయడం జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, బి.మల్లేష్,కె. వెంకటయ్య, ఆశ వర్కర్ కావలి మంజుల మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

11
Aug