BB6 TELUGU NEWS 7 Aug 2025 : హైదరాబాద్: మూసీ పరివాహక ప్రాంతాలకు అలెర్ట్..హిమాయత్‌సాగర్‌కు భారీగా వరద
కాసేపట్లో హిమాయత్‌సాగర్ గేటు ఎత్తనున్న అధికారులు.ఒక గేటును అడుగు మేర ఎత్తనున్న అధికారులు.ఇప్పటికే నిండుకుండలా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్
హైదరాబాద్ సిటీలో పెనుగాలులతో కుండపోత వర్షం.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హిమాయత్‌నగర్, లక్డీకపూల్, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, మాదపూర్, కొండాపూర్, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్, ఏఎంబీ, ఇనార్బిల్ మాల్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారుల.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న నగర రోడ్లు.. ఒక వైపు వర్షం.. మరో వైపు ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇక్కట్లు.. కిలో మీటర్ల మేర రోడ్లపై నిలిచిపోయిన ట్రాఫిక్.. చాదర్‌ఘాట్ నుండి ఎల్బీ నగర్ వరకు భారీగా ట్రాఫిక్..
హైదరాబాద్‌లో భారీగా వర్షపాతం నమోదు.. అత్యధికంగా గచ్చిబౌలిలో 12.5 సెం.మీ. వర్షపాతం.. ఖాజాగూడలో 12, ఎస్ఆర్ నగర్లో 11, శ్రీనగర్ కాలనీలో 11.1, ఖైరతాబాద్‌లో 10.09, యూసుఫ్‌గూడలో 10.4, ఉప్పల్‌లో 10, బంజారాహిల్స్‌లో 9, నాగోల్‌లో 8.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు.
హైదరాబాద్ సిటీలో పెనుగాలులతో కుండపోత వర్షం.గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం.

07
Aug