తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానంటూ పెదకాకానికి చెందిన వైకాపా ఎంపీటీసీ సభ్యురాలు గుల్జార్ రూ.40 లక్షలు వసూలు చేసి మోసం చేశారని గుంటూరులోని కొత్తపేటకు చెందిన నాగదుర్గ, నరసింహకృష్ణ, ఆరిఫ్ సోమవారం పోలీసు కార్యాలయంలో ఏఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేశారు.
గుంటూరు నేరవార్తలు,BB6NEWS : తక్కువ ధరకుబంగారం ఇప్పిస్తానంటూ పెదకాకానికి చెందిన వైకాపాఎంపీటీసీ సభ్యురాలు గుల్జార్ రూ.40 లక్షలు వసూలుచేసి మోసం చేశారని గుంటూరులోని కొత్తపేటకుచెందిన నాగదుర్గ, నరసింహకృష్ణ, ఆరిఫ్ సోమవారంపోలీసు కార్యాలయంలో ఏఎస్పీ సుప్రజకు ఫిర్యాదుచేశారు. డబ్బులు తిరిగివ్వమని అడిగితే బ్లేడ్ బ్యాచ్,రౌడీషీటర్లతో చంపిస్తానంటూ బెదిరిస్తున్నారనిపేర్కొన్నారు. స్పందించిన ఏఎస్పీ దర్యాప్తు చేసిబాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులనుఆదేశించారు. బాధితులు విలేకరులకు వెల్లడించినవివరాలు… ‘మూడు నెలల క్రితం గుల్జార్ తనకున్నపరిచయాలతో బంగారాన్ని మార్కెట్ ధరలో సగానికేఇప్పిస్తానని చెప్పారు. అందుకు కనీసం రూ.5 లక్షలుపెట్టుబడి పెట్టాలని షరతు విధించారు. తానుఇప్పటివరకు అనేకమందికి బంగారు బిస్కెట్లు,ఆభరణాలు ఇలా తక్కువ ధరకే ఇచ్చానని తేదీలు సహాఫొటోలు చూపించారు. ఆమె మాటలు నమ్మి మాబంగారు నగలు తాకట్టు పెట్టి మరికొంత నగదు కలిపిఆమెకు ఇచ్చాం. మాతోపాటు మరికొంతమంది రూ. 40లక్షల వరకు ఇచ్చాం. ఇంతవరకు బంగారపు వస్తువులుఇవ్వలేదు. డబ్బులు తిరిగిచ్చేయమని అడుగుతుంటేపోలీసులు, రౌడీషీటర్లు, బ్లేడ్బ్యాచ్లతో పరిచయాలుఉన్నాయని, మా ప్రాణాలకు హాని తలపెడతాననిబెదిరిస్తున్నారని బాధితులు చెప్పారు.