వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో గత సంవత్సరం లో గ్రామానికి చెందిన ఎర్రం రాములు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 21805 వేల పాలసీ తీసుకోవడం జరిగింది. పాలసీ తీసుకున్న 50 రోజుల లోపే కరెంట్ షాక్ తగిలి మరణించడం జరిగింది నామిని అయినా ఎర్రం లక్ష్మి కి 7 లక్షల ఇరవై తోమిది వేల బీమా చెక్కు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు గురువారం జీవిత బీమా చెక్కుని స్థానిక ఎస్సై రమేష్ చేతుల మీదుగా నామికీ అందజేయడం జరిగింది. అలాగే ప్రతి నెల 3000 రూపాయలు పెన్షన్ రూపంలో 14 సంవత్సరాల పాటు మొత్తం 12 లక్షల 30000 ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి గాలి నీరు కూడు గూడు ఎంత అవసరమో జీవిత బీమా కూడా అంతే అవసరము అని అన్నారు, భారతదేశ జనాభా 150 కోట్లు దాటినప్పటికీ కేవలం 10 నుండి 12 శాతం మందికి మాత్రమే ఇన్సూరెన్స్ కలిగి ఉన్నారన్నారు అలాగే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇన్సూరెన్స్ గురించి తెలియక చాలామంది పాలసీలు చేయలేక పోతున్నారన్నారు, కావున ప్రతి ఒక్క వ్యక్తి ఏదైనా జీవితంలో ఒక పాలసీ కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఏజీఎం శ్రీనివాస్, రీజినల్ మేనేజర్ సురేష్, మాజీ సర్పంచ్ అనురాధ బాల్ రెడ్డి, మాజీ ఎంపిటిసి పద్మ రఘు గౌడ్, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డివో శంకర్ కంపెనీ ఎంప్లాయిస్, గ్రామ పెద్దలు యువజన సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
