భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ, గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాన్

భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ, గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాన్

పావని తిన్నావా,పిల్లలు తిన్నారా.. నాన్నను బాగా చూసుకోవాలి, చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి

పిల్లలను బాగా చదివిద్దాం. ఇప్పటికే రూ.34 లక్షలు అప్పు చేశా.. నువ్వు మన కుటుంబానికి అండగా ఉండు అంటూ భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ గన్‌తో కాల్చుకున్న జవాన్ మురళి

శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం శివపురంకొట్టాలకు చెందిన కంచుకుంట మురళి(30) 2017 నుండి సీఆర్పీఎఫ్ జవాన్‌గా పని చేస్తున్నాడు

5 ఏళ్ల కిందట ప్రేమించి లోకపావనిని వివాహం చేసుకున్నాడు.. వీరికి కుమారుడు తారక్ రామ్(4), కుమార్తె మహి(2) ఉన్నారు

తండ్రి ముత్యాలన్న చర్మసంబంధ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుండడంతో, అతనికి చికిత్స అందించడానికి మురళి సుమారు రూ.30 లక్షలు అప్పు చేశాడు

మురళి కారును నాలుగు నెలల కిందట స్నేహితుడు  తీసుకెళ్తుండగా, ప్రమాదంలో ఒకరు చనిపోయారు.. కారు నంబరు ఆధారంగా మురళిని గుర్తించి, కేసు రాజీ అయ్యేందుకు మృతుడి కుటుంబసభ్యులు రూ.15 లక్షలు డిమాండ్ చేయగా, తండ్రి వైద్యం కోసం ఉంచిన రూ.4 లక్షలు ఇచ్చాడు

అలాగే చెల్లి పెళ్లి చేయాల్సి ఉండగా, ఇన్ని అప్పులు అవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మురళి, భార్యతో మాట్లాడుతూ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe