PTA ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులకు పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన కందగట్ల ఫ్యామిలీ

మహబూబ్నగర్ జిల్లా గండీడ్ హాస్టల్లో పి టి ఏ ఆధ్వర్యంలో కందగట్ల వరప్రసాద్ ఫ్యామిలీ విద్యార్థులకు సరిపడా బంకర్ బెడ్లు ,పరుపులు దుప్పట్లు 20 ,కుర్చీలు 10, టేబుల్ లు మరియు ఆన్లైన్ ట్యూషన్ చెప్పడానికి 65 ఇంచెస్ టీవీ ఏర్పాటు చేశారు. ప్రసాద్ మామగారైన తాటికొండ సుదర్శనము గారి 75 వ జన్మదిన వేడుకల సందర్భంగా వారి కుటుంబ సభ్యులు విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు .

ఈ సందర్భంగా వారి అమ్మా,నాన్న అత్తమ్మ, వదిన, మరదలు, కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఎంపీడీవో హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు కల్పించిన ఈ వసతుల వల్ల విద్యార్థులు మంచి స్థాయిలోకి రావాలని ఆకాంక్షించారు.
వరప్రసాద్ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో  మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ హరిశ్చందర్ రెడ్డి, ఎంఈఓ జనార్ధన్ ,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కృష్ణయ్య  , డైరీ కోఆర్డినేటర్ మైపాల్ రెడ్డి, పి టి ఏ  ప్రతినిధులు సాయి ,కమల్ , శ్రీధర్, విద్యా వారధి ఇంచార్జ్ వి జనార్ధన్ ,ఉపాధ్యాయులు కృష్ణయ్య ,పిడి రాములు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe