BB6TELUGUNEWSCHANNEL, కూకట్ పల్లి: మూసాపేట్ సర్కిల్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సునీత ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆస్తిపన్ను చెల్లించే విషయంలో ఓ వినియోగదారుడి నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 80 వేల రూపాయలు డిమాండ్ చేసిన సునీత, దానిలో మొదటగా 30 వేలరూపాయలు తీసుకుంటున్న క్రమంలో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి.
హైదరాబాద్ కూకట్పల్లిలో ఏసీబీ రైడ్స్..రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సీనియర్ ట్యాక్స్ అసిస్టెంట్ సునీత

02
Jul