పాలమూరుకు అరుదైన అవకాశం
మహబూబ్‌నగర్‌లో బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్

దేవరకద్రలో స్థలం పరిశీలించిన అధికారులు
మహబూబ్‌నగర్‌లో బ్రహ్మోస్ యూనిట్
భారత రక్షణ వ్యవస్థలోని కీలకమైన క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. దీన్ని భారతదేశ బ్రహ్మాస్త్రంగా పరిగణిస్తారు. ఆపరేషన్ సిందూర్ వేళ బ్రహ్మోస్ పని తీరు చూసి పాక్ సహా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. అలాంటి కీలకమైన క్షిపణీ తయారీ యూనిట్, డిఫెన్స్ కారిడార్‌ను.. తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది.

అయితే బ్రహ్మోస్ మిసైల్ తయారీ యూనిట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈక్రమంలో బ్రహ్మోస్ మిసైల్ తయారీ యూనిట్‌ను మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బ్రహ్మోస్ జనరల్ డైరెక్టర్, డీఆర్డీవో ఆఫీసర్లను కోరారు. సీఎం రేవంత్ సూచనతో వారు.. తాజాగా దేవరకద్రలో పర్యటించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 80 డాక్టర్లను కాపాడిన ఫ్యామిలీ.. కానీ తల్లీ, కుమార్తె దుర్మరణం
తెలంగాణలో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్లోనే, ఆగస్టు నాటికి అందుబాటులోకి..!
అన్నదాత సుఖీభవ పథకం.. డబ్బులు పడేది అప్పుడే..!
దేవరకద్రలో మిసైల్ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి కీలకమైన తయారీ యూనిట్లను సాధారణంగా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేస్తారు. అలానే బ్రహ్మోస్ మిసైల్ తయారీ యూనిట్‌ను కూడా మొదట హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయాలని భావించారు. కానీ మిసైల్ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు 400 ఎకరాల వరకు భూమి అవసరం ఉంది.


అయితే హైదరాబాద్‌లో ఇంత భారీ మొత్తంలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేదు. ప్రైవేట్ భూములున్నాయి. కానీ వాటి ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది. దీంతో ప్రభుత్వం.. హైదరాబాద్‌లో కాకుండా మరో ప్రాంతంలో మిసైల్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. ఇందుకు అనువైన ప్రదేశం కోసం ఆరా తీస్తుండగా.. మహబూబ్‌నగర్ జిల్లా.. అధికారుల దృష్టిని ఆకర్షించింది.


మహబూబ్ నగర్ జిల్లా.. హైదరాబాద్, శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో ఉండటమే కాక బెంగళూరుకు నేషనల్ హైవే 44 రోడ్డు కనెక్టివిటీ కలిగి ఉంది. దీంతో హైదరాబాద్ బదులు మహబూబ్‌నగర్ ప్రాంతం మిసైల్ తయారీ యూనిట్‌కు అనుకూలంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం.. బ్రహ్మోస్ అధికారులకు ఇదే విషయాన్ని తెలిపింది. ఈక్రమంలోబ్రహ్మోస్ జనరల్ డైరెక్టర్ జైతీర్థ్ జోషి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డీఆర్డీవో డైరెక్టర్ జీఏ శ్రీనివాస్‌మూర్తి వారం రోజుల క్రితం దేవరకద్ర సెగ్మెంట్‌లోని చౌదర్‌పల్లి–బస్వాయ్పల్లి గ్రామాలను సందర్శించారు.
స్థానిక అధికారులు ఈ రెండు గ్రామాల్లో దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూమిని డిఫెన్ అధికారులకు చూపించగా వారు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. రెండు సెంటర్లను ఇక్కడే స్థాపించే అవకాశం 100 శాతం ఉందని డిఫెన్స్ అధికారులు తెలిపారు. మహబూబ్‌నగర్‌లో బ్రహోస్ మిసైల్ తయారి యూనిట్ ఏర్పాటు చేస్తే.. సుమారు 8 వేలమందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంటున్నారు.

ఇక ఇప్పటికే యూపీ, తమిళనాడులో రెండు డిఫెన్స్ కారిడార్లు ఉండగా.. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న దానితో కలిపి ఈ సంఖ్య మూడుకు చేరనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా.. రక్షణ రంగంలో కూడా దేశీయంగా తయారైన వస్తువులనే వాడాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం పెద్ద మొత్తంలో నిధులు కూడా కేటాయిస్తున్న సంగతి తెలిసిందే

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe