వినాయక చవితి తొలి పూజ చేసిన చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి..

BB6 News Telugu : తాండూరు ఆగస్టు 27: బుధవారం వినాయక చవితి,సందర్భంగా  తాండూరు హిందూ,ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పట్టణంలోని ప్రతిష్టించిన గణనాథులను,మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు.పట్టణంలో భద్రేశ్వర చౌక్ లో పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..తాండూరు పట్టణంలో అందరు సుఖ, సంతోషాలతో పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.అలాగే తాండూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర నాయకులు కరణంపురుషోత్తం రావు.మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్.రాజు గౌడ్. నర్సింలు.మాజీ ఫ్లోర్ లీడర్‌ శోభారాణి.అశోక్.తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe