చౌడపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆశోక్ కుమార్
BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం చౌడపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి ఒక్క పేద వాడికి ఇల్లు నిర్మించాలి అనే తపనతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లో భాగంగా శుక్రవారం రోజున డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చౌడాపూర్ గ్రామంలో లబ్ధిదారులు బోయిని లక్ష్మమ్మ ఇందిరమ్మ ఇంటి ప్రొసిడింగ్ అందజేసి ఈ రోజు ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా బోయిని లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చౌడాపూర్ మండల అధ్యక్షులు ఎల్పటి అశోక్ కుమార్.గ్రామ పంచాయితీ కార్యదర్శి రాజిరెడ్డి. గ్రామ కమిటీ అధ్యక్షులు గోపాల్ తొంబ చెనయ్య. యాదయ్య. రాములు. బొర్రా రమేష్.జంగయ్య. బాలరాజ్.అంజి.శ్రీను.విట్టలయ్య. నర్సింలు.మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు