సుప్రీంకోర్టు : ఆధార్ కార్డు ప్రభుత్వం జారీ చేసిందే కదా ఎన్నికల సంఘం అంగీకరించాల్సిందే

BB6 TELUGU NEWS CHANNEL
బీహార్ ఓటర్ లిస్టులో పేర్ల తొలగింపుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఓటర్ లిస్టు సవరణకు ఆధార్ కార్డు సరిపోతుందని స్పష్టం చేసింది. ఆధార్ కార్డును ప్రూఫ్ ఆఫ్ ఎసిడెన్స్ గా ఓటర్లు సబ్మిట్ చేయవచ్చునని చెప్పింది. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డులను లిస్టులో యాడ్ చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ కు సూచించింది.

బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పేరున ఓటర్ లిస్టు నుంచి దాదాపు 65లక్షల మంది పేర్లు తొలగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై నమోదైన పిటిషన్లపై శుక్రవారం (ఆగస్టు 22)విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఓటర్ల జాబితాలో డిలీట్ అయిన వారి పేర్లు మళ్లీ నమోదు చేసేందుకు ఎన్నికల సంఘం సూచించిన 11 గుర్తింపు పత్రాలలో ఏదో ఒకటి జత చేయాలి లేదా ఆధార్ కార్డును సబ్మిట్ చేసి నమోదు చేసుకోవచ్చునని
సూచించింది.

రాజకీయ పార్టీలకు సూచనలు: ఈ సందర్భంగా బీహార్ లో రాజకీయ పార్టీల వ్యవహారం పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ లిస్టు నుంచి 65లక్షల ఓట్లను తొలగించారని ఆందోళన చెందుతున్న పార్టీలు.. ఓటర్లకు ఆధార్ కార్డును లేదా ఇతర కార్డులతో మళ్లీ నమోదు చేసుకునేందుకు పార్టీలు ఎందుకు సహాయం చేయడం లేదని ప్రశ్నించింది.ఈ విషయంలో బూత్ లెవల్ ఏజెంట్లు ఏం చేస్తున్నారని మండి పడింది.

బీహార్ లో ఉన్న 12 పొలిటికల్ పార్టీలు..ఓటర్లకు సహాయం చేసేందుకు పార్టీ కార్యకర్తలను ఆదేశించాలని సూచించింది. ఎన్నికల కమిషన్ ఫామ్ 6 లో సూచించిన విధంగా 11 డాక్యుమెంట్లు లేదా ఆధార్ కార్డు తో డిలీట్ అయిన ఓటర్లు మళ్లీ నమోదు చేసుకునేందుకు కార్యకర్తలు సహాయం చేయాల్సిందిగా ఆదేశించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe