BB6 TELUGU NEWS CHANNEL
ఎఫ్ ఆర్ టి ఐ జాతీయ గౌరవ అధ్యక్షులు ప్రత్తిపాటి.చంద్రమోహన్,జాతీయ అధ్యక్షులు మట్టా.ప్రసాద్ సూచనల మేరకు,జాతీయ సంయుక్త కార్యదర్శి కుప్పాల.అజయ్ ప్రసన్న కుమార్ నేతృత్వంలో తిరుపతి జిల్లా , పుత్తూరు మున్సిపాలిటీ కమిషనర్ డి వి.నాగేశ్వర రావు గారితో, మరియు పుత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ జె. చంద్ర శేఖర్ తో, సమావేశం అయ్యి చట్టాలతో కూడిన ఫోరం ఫర్ ఆర్ టి ఐ నూతన క్యాలెండర్ను అందించి, ఈ ఆఫీస్ లో సంబంధిత శాఖల నుంచి సామాన్య ప్రజలకు కూడా కావలసిన సమాచారాన్ని ఆర్ టి ఐ చట్టం నిర్దేశిత గడువు లోపల అందించాలని కోరినప్పుడు,ఆర్ టి ఐ సెక్షన్స్ ప్రకారం,వారి శాఖ నుంచి సమాచారం అడిగిన ప్రజలకు వెంటనే అందేలా చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్ ఆర్ టి ఐ రిజిస్టర్డ్ శాఖలో హ్యూమన్ రైట్స్, సమాచార హక్కుచట్టం, లోకాయుక్త చట్టాల పరిధిలో బాగంగా , గవర్నమెంట్ తో సమన్వయం చేసుకుంటూ అందరికీ అవేర్నెస్ ఇవ్వటం జరుగుతుంది.సంబంధిత గవర్నమెంట్ శాఖల అధికారులు,ప్రజలకు ఉచితంగా అందించాల్సిన సర్వీసెస్ ను, నిజాయితీగా మంచి పౌర సంబంధ సేవలతో, అవినీతికి దూరంగా ప్రజలు అందరికీ సర్వీసెస్ అందేలా చూడాలని కోరారు.అందుకు ఆయా శాఖల గవర్నమెంట్ పై అధికారులుగా, వారు రిప్లై ఇస్తూ సామాన్య ప్రజలకు కూడా నిజాయితీగా, మంచి సర్వీసెస్ అందేలా చూస్తామని సమాచారహక్కు చట్టం అప్పీలేటు అధికారుల ఫోన్ నంబర్స్, పేర్లు వారి ఆఫీసుల బయట, ప్రజలకు పారదర్శకతతో తెలిసేవిధంగా డిస్ప్లే లో ఎప్పుడూ ఉంచుతామని తెలిపారు. మరియు గవర్నమెంట్ అధికారులను సమన్వయం చేసుకుంటూ, స్వచ్ఛందంగా సమాజం పట్ల తమ దైన శైలిలో బాధ్యత గా వ్యవహరిస్తున్న ఎఫ్ ఆర్ టి ఐ నేతలకు ,ఆక్టివ్ మెంబెర్స్ కు లీగల్ గా తమ సహకారం అందిస్తామని తెలిపారు.అలాగే అవినీతికి తావులేకుండా,తమ ఆఫీసుల్లో సిబ్బంది అందరికీ, దిశానిర్దేశం చేసి పబ్లిక్ కు మంచి సేవలు అందిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో జాతీయ కమిటీ నేత కె .అజయ్ ప్రసన్న కుమార్ తో పాటు,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కరాటే డి సి ఎస్ రాయల్ , తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీ బి. వెంకట్,తిరుపతి జిల్లా మహిళా ఇంచార్జి, నగరి పుత్తూరు నియోజక వర్గ ప్రెసిడెంట్ వి.జయ లక్ష్మీ, తిరుపతి జిల్లా ఇంచార్జి అధ్యక్షులు మరియు కమిటీ ప్రెసిడెంట్ జి.వేణు గోపాల్ పాల్గొన్నారు.
ఎఫ్ ఆర్ టి ఐ నేతలు పుత్తూరు మున్సిపాలిటీ కమిషనర్, గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తో భేటీ
10
Feb