BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో ఎర్రి పెద్ద నర్సింలు ఆరోగ్యంతో చనిపోవడం జరిగింది. వీరిది పూర్తిగా నిరుపేద కుటుంబం కాబట్టి అంత్యక్రియలకు ఖర్చులకోసం ఎంతోకొంత ఆర్థిక సహాయం చేసి బాధిత కుటుంబానికి అండగా ఉందామని ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ ఇజం గ్రూపులో మరియు గండీడ్ మండల రాజ్యాధికారం గ్రూపు గండీడ్ మండల MRPS గ్రూపు లలో మెసేజ్ పెట్టి ఆర్థిక సహాయం చేయాలని కోరిన వెంటనే ఎవరికి తోచిన కాడికి వారు అమౌంటు సహాయం చేయడం జరిగింది. ఈరోజు ఉదయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి నర్సింలు పార్థివ దేహానికి పూలమాలవేసి 10,000 పదివేల రూపాయలు మృతుడి భార్యకు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక గ్రామ ఉపసర్పంచ్ గుముడాల చెన్నయ్య, మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపిటిసి కప్లాపూర్ ఆశన్న, గండీడ్ మండల మాజీ జెడ్పిటిసి జంగల్ల వెంకటన్న, ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, మాజీ ఎస్ఎంసి చైర్మన్ చిట్లపల్లి నాగేష్, గండీడ్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు హస్నాబాద్ వెంకటయ్య, డప్పు కళాకారుల సంఘం మండల గౌరవ అధ్యక్షులు హస్నాబాద్ చంద్రన్న, అంచన్పల్లి మాజీ సర్పంచ్ కొప్పుల మాసయ్య నర్సింలు, చెన్నప్ప, బాలయ్య, రాoచందర్, కేశవులు, నరసయ్య భీమయ్య తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు
అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం
06
Jan