ఇంట్లో వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం భారీగా ఆస్తి నష్టం..

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని నంచర్ల గ్రామంలో దేవుడికి దీపారాధన చేసి బయటికి వెళ్లిన కాసేపటికే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే
వడ్డే నరసింహులు తండ్రి పేరు బాలకృష్ణయ్య వయస్సు 50, కులం వడ్డెర వృత్తి కూలి పని చేసుకొని బ్రతికే ఒక కుటుంబం రోడ్డు పాలయ్యింది. ఇంట్లో నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో 100కు డయల్ చేస్తే హుటా హుటినా నంచర్ల గ్రామానికి చేరుకొన్న ఇద్దరు కానిస్టేబుళ్లు నజీర్ మరియు సహదేవ్ నంచర్ల గ్రామస్తులతో కలిసి నీటితో మంటలను చల్లార్చారు. ఇంటి పెద్ద ఇచ్చిన సమాచారం ప్రకారం 50 వేల నగదు, బియ్యం బస్తాలు, బట్టలు ,టీవీ మరియు ముఖ్యమైన డాక్యుమెంట్లు ఖాళీ బూడిది అయినాయని తెలిపారు. బండల ఇల్లు కట్టెలతో నిర్మాణం కావడంతో పూర్తిగా మంటలు అంటుకొని బూడిద అయిందని తెలిపారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని గ్రామస్తులు తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe