BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం లో గత నెల డిసెంబర్ 5వ తారీఖు నాడు మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన ఎండి రేష్మ భర్త సుభాన్ యొక్క పెద్ద కూతురు ఎండి ఆయేషా వయసు 25 సంవత్సరాలు ఇంట్లో వేడి నీళ్లు బకెట్లో పోస్తుండగా ప్రమాదవశాత్తు ఆ నీళ్లు మీద పడి తీవ్ర గాయాలు కాగా ఇన్ని రోజులు ఇంట్లోనే చికిత్స చేపిస్తూ తగ్గకపోవడంతో జనవరి ఒకటో తేదీ 2026 నాడు మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొరకు చేర్పించినా ఎండి ఆయేషా అనే మహిళ చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం తేదీ రెండు ఒకటి 2026 నాడు మృతి చెందింది. మృతురాలు యొక్క తల్లి అయిన ఎండి రేష్మ దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మహమ్మదాబాద్ ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.
ప్రమాదవశాత్తు వేడి నీళ్ళు పైన పడటంతో మహిళ మృతి
03
Jan