రేపు 17న  జిల్లా కేంద్రాలలో డీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు.. టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్

BB6 TELUGU NEWS CHANNEL
జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది.

ఏఐసీసీ పిలుపు మేరకు
రేపు 17న అన్ని జిల్లా కేంద్రాలలో మహాత్మా గాంధీ చిత్ర పటాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు..

ఎన్నో ఉద్యమాల ఫలితంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఉపాధి హామీ.పథకాన్ని నీరు గార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది.. మహేష్ కుమార్ గౌడ్..

ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతల నుంచి కేంద్రం పక్కకు జరగాలని కుట్ర చేస్తుంది. పేదలకు, గ్రామీణ ప్రాంత కూలీలకు ఎంతో బరోసాగా ఉన్న ఈ పథకాన్ని నీరు గార్చాలని బీజేపీ కుట్ర చేస్తుంది.

అందుకు నిరసనగా 17న రేపు జిల్లా కేంద్రాలలో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి.  గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన తెలియజేయాలి..

అలాగే జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 28న గ్రామాలలో, మండలాల్లో గాంధీ చిత్రపటాలతో కార్యక్రమాలు చేపట్టాలి.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పని కి ఇచ్చే గౌరవాన్ని ప్రకటించాలి..
17న, 28న ఈ.నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం అయ్యేలా ప్రతి కార్యకర్త, నాయకులు పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు..

మహేష్ కుమార్ గౌడ్..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe