అయ్యప్ప స్వామి దీవెనలు తాండూరు నియోజకవర్గంపై ఉండాలి – MLA BMR

BB6 TELUGU NEWS CHANNEL
తాండూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి  మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది..

అధిక సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప స్వాములు మరియు భక్తులు.

అయ్యప్ప స్వాముల నృత్యాలు, భక్తుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.

స్వామి వారి సంకీర్తనలు, భజనల మధ్య అయ్యప్ప స్వామి పల్లకీ సేవ అంగరంగ వైభవంగా జరిగింది.

అయ్యప్ప స్వామి నామస్మరణతో తాండూరు పట్టణం మార్మోగింది.

అయ్యప్ప స్వామి ఆశీస్సులు తాండూరు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే బీఎంఆర్ గారు ఆకాంక్షించారు..

ఈ కార్యక్రమంలో బుయ్యని కుటుంబ సభ్యులు, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe