రౌడీయిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ నే BRS చేసిన అరాచకాలు అందరికీ తెలుసుమార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి వెల్లడి..

BB6 TELUGU NEWS CHANNEL
కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పైన లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం  తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల పై లేని పోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చ రించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి కూడా బెదిరించ లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో చేసిన అరాచకాలు తాండూరు ప్రజలకు తెలుసు అని అన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీని ఓడించారని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రజలతో  అందు బాటులో ఉండి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని తాండూరు సమస్యలను పరిష్క రిస్తున్నారని తెలిపారు. కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి తాండూరు అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కేవలం శిలాఫల కాలకే పరిమిత మైందని తెలిపారు. గత పాలనలో మీరు చేసిన అరాచకాలు, మోసాలను చూసి మీకు ప్రజలు గుణపాఠం చెప్పారని వెల్లడించారు. సర్పంచ్ పదవికి కనీసం మీకు అభ్యర్థులు కూడా దిక్కు లేదని కొన్ని,, రోజు లైతే బీఆర్ఎస్ పార్టీలో నాయకులు కార్యకర్తలు కూడా ఉండరని, తెలిపారు. ప్రశాంత వాతా వరణంలో ఉన్న తాండూరులో లేనిపోనివి ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెడితే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పత్తా లేకుండా పోతుందని,, హెచ్చరించారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని,, స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe