కాంగ్రెస్ బెదిరింపులకు భయ పడకండి..కాంగ్రెస్ నేతలపై పైలట్ ఫైర్..

BB6 TELUGU NEWS CHANNEL
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు.మంగళవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్  రోహిత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.. స్థానిక ఎన్నికల్లో భాగంగా పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులు లేకుండా,, పార్టీల కతీతంగా జరుగుతున్నాయని ఆన్నారు.ఎమ్మెల్యే అను చరులు రౌడియిజం చేస్తూ, ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ మద్దతు దారులపై బెదిరింపులకు పాల్పడు తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి సపోర్టు చేయకపోతే సంగతి చూస్తామని భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.బలం నిరూపించు కోవాలంటే తాండూరు అభివృద్ధిలో చూపించాలని అన్నారు. తాండూరు ఎమ్మెల్యేకు ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని, గ్రామాల పేర్లు కూడా ఆయనకు తెలియదని విమర్శించారు.వచ్చే మూడేళ్లలో అయినా కనీసం 10శాతం అభివృద్ధి అయినా చేసి చూపించాలని డిమాండ్ చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి,, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అన్నారు. పార్టీ పరంగా అయినా ఎంత శాతం ప్రాధాన్యత ఇచ్చారో చెప్పాలని సవాల్ చేశారు.మీడియాపై కూడా కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలు జరుగు తున్నాయని, తమ దృష్టికి వచ్చిందన్నారు.బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడు తున్నారని, బషీరాబాద్ మండలం కొత్లాపూర్ గ్రామానికి చెందిన జాగీరు రాములుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ప్రేమ్ సింగ్, రమేష్, సంజీవ్ లు బెదిరింపులకు పాల్పడి,, దాడికి యత్నించారని అన్నారు.బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు భయపడేది లేదని అన్నారు.పంచాయతీ ఎన్నిక లలో గెలుపు, ఓట ములను ప్రజలే నిర్ణయిస్తారని, అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బల పరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు. పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరుకుల నరేందర్ గౌడ్. తాండూరు మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి. యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి. బషీరాబాద్ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి. పెద్దేముల్ మండల అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్. నాయకులు మల్లారెడ్డి. శేఖర్ తదితరులు ఉన్నారు…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe