వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఒకే కుటుంబానికి మూడు పదవులు

BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో మంతన్గాడ్ లో ఒకే కుటుంబానికి మూడుపదవులు దక్కనున్నాయి. గ్రామంలో 8 వార్డులు, 494మంది ఓటర్లున్నారు. మైల్వార్ నుంచి 16 ఏళ్ల కిందట భీమప్ప, వెంకటమ్మ దంపతులు మంతన్ గౌడ్ తండాకు వచ్చి స్థిరపడ్డారు. వారి కుమారు లిద్దరూ హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఈ కుటుంబంలో 6 ఓట్లు ఉన్నాయి. భీమప్ప ఇల్లున్న ప్రాంతం మంతన్ గౌడ్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడి సర్పంచి స్థానాన్ని ఎస్టీ జనరల్ కు కేటాయించారు. దీంతో పాటు 4వ వార్డు ఎస్టీ జనరలు, 6వ వార్డు ఎస్టీ మహిళలకు రిజర్వు అయ్యాయి. గ్రామంలో ఇతర ఎస్టీ కుటుంబాలేమీ లేకపోవడంతో సర్పంచి, రెండు వార్డు సభ్యుల పదవులు భీమప్ప కుటుంబానికే దక్కనున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe