మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్‌ను మహబూబ్ నగర్ జిల్లా అధికారి డి.జానకి, సందర్శన

BB6 TELUGU NEWS CHANNEL
మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్‌ను మహబూబ్ నగర్ జిల్లా అధికారి డి .జానకి సందర్శించి విధుల నిర్వహణ, ప్రజల ఫిర్యాదుల స్వీకరణ మరియు ఫైల్స్ ప్రాసెస్‌పై సమగ్రంగా తనిఖీ చేశారు.

సందర్శన సందర్భంగా ముందుగా స్టేషన్ సిబ్బందితో మాట్లాడి, ప్రతి ఒక్కరు ఏ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, వారికి కేటాయించిన వీధుల్లో పహారా పనులు ఎలా చేస్తున్నారు అనే విషయాలను వివరంగా తెలుసుకున్నారు.

స్టేషన్‌కు వచ్చిన దరఖాస్తుదారులను ఎలా ఆదరిస్తున్నారు, వారి సమస్యలను ఎంత వేగంగా పరిష్కరిస్తున్నారు, అలాగే రిజిస్టర్ ఫైల్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారా లేదా అన్న అంశాలను పరిశీలించారు.

ప్రతి దరఖాస్తు రిసెప్షన్‌లో నమోదు చేసి, కేసు చేయాల్సిన వాటిపై వెంటనే కేసులు నమోదు చేయాలి, అనంతరం సీసీటీఎన్ఎస్‌లో సమయానికి అప్‌లోడ్ చేయడం తప్పనిసరి అని సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చారు. ఆలస్యం లేకుండా, బాధితులకు ఇబ్బంది లేకుండా పనిచేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు.

ముందున్న స్థానిక ఎన్నికల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు, అప్రమత్తంగా ఉండాల్సిన విషయాలను సిబ్బందికి వివరించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, మహబూబ్నగర్ రూరల్ సీఐ గాంధీ నాయక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe