BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సబ్-కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి, ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం రోజు బీసీ రిజర్వేషన్లకు 42% చట్టబద్ధత కల్పించకుండానే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ,ఆర్.కృష్ణయ్య పిలుపు మేరకు కందుకూరి రాజ్ కుమార్ నేతృత్వంలో తాండూర్ సబ్-కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి, ప్లకార్డులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవడం అన్యాయం,అని అన్నారు.17వ తేదీ క్యాబినెట్ సమావేశంలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని, పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం,అలాగే కేంద్రం నుండి నిధులు పొందడానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నామని,చెప్పడం బీసీలను మభ్యపెట్టే రాజకీయ మాటలు,తప్ప మరేమీ కావని విమర్శించారు.ఈ కార్యక్ర మంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్.జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్. జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి. తాండూర్ మహిళా అధ్యక్షురాలు అనిత. ఉపాధ్యక్షుకార్యదర్శులు మంజుల.నరసమ్మ. జగదీశ్వరి.నాయి బ్రాహ్మణ సమాజ అధ్యక్షులు పరమేష్. రజక సంఘం అధ్యక్షు కార్యదర్శులు రమేష్. రవికుమార్.కురువ సంఘం సభ్యులు బసప్పగౌడ.సంఘం నాయకులు పండు గౌడ్.హరి ప్రసాద్ గౌడ్.రవి గౌడ్. ముదిరాజ్ సంఘం నాయకులు రాము ముదిరాజ్. దుబాయ్ వెంకట్.హరి ప్రసాద్. శ్రీనివాస్.బహుజన నాయకులు అరుణ్ రాజ్. జోసఫ్.ప్రవీణ్.సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్. బీసీ సంఘం మండల అధ్యక్షులు నరేందర్.బసంత్ కుమార్.బీసీ యువ నాయకులు యాసర్.పరమేష్.అశోక్. శ్రీనివాస్.పకీరప్ప.అంబాదాస్. రాజు.జగదీష్.కందినేని జగన్. కందనెల్లీ జగన్. జగ దీశ్వరయ్య.శ్రీనివాస్.చిన్న కిరణ్.వినయ్ తదితరులు పాల్గొన్నారు..
