BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిలా తాండూర్ నవంబర్ : తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో తాండూర్ మండల స్థాయి అధికారులతో “రివ్యూ మీటింగ్” నిర్వహించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) గారు..
సమావేశంలోని అంశాలు..
డిసెంబర్ 1 నుండి 9 వరకు జరిగే ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా అన్ని గ్రామాలలో పర్యటిస్తా. అప్పటి వరకు గ్రామాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి.
విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలి. విద్యుత్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలి.
గ్రామాల్లో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథ సరఫరాలో నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు సూచించారు.
అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సహకారం అవసరమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది.
వన మహోత్సవం కింద గ్రామాల్లో నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
అధిక వర్షపాతం వలన పంటలు పాడై రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, కావున పత్తి రైతులకు పత్తి అమ్మే సమయంలో ఇబ్బందులు రాకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
MGNREGS కింద ఈ సంవత్సరం అన్ని గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాల పహారీలు, కిచెన్ షెడ్లు, టాయిలెట్లు, అంగన్వాడీ భవనాలు, గోదాములు మంజూరు చేస్తామని, అందుకుగాను ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పంచాయతీ రాజ్ శాఖ అధికారులకు సూచించారు..
క్షేత్రస్థాయిలో పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పురోగతి సాధించాలని హౌసింగ్ ఏఈ, మరియు పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు.
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి.
దోమల నివారణకు పాగింగ్ చేయాలి ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు.
ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకురండి.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, తాండూరు మండలానికి చెందిన అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
