అడవిని వదిలి ఏపీలో ప్రవేశించిన మావోయిస్టు అగ్రనేతలు – విజయవాడలో ఉలిక్కిపాటు

BB6 TELUGU NEWS CHANNEL
ఛత్తీస్‌గఢ్‌లో హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టు దళాల్లో గందరగోళం నెలకొన్నది. ఈ నేపథ్యంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు అడవులను వదిలి ఆంధ్రప్రదేశ్‌లోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం వెల్లడించింది.

విజయవాడలో మాత్రం పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది.

ఇటీవల జరిగిన ఆపరేషన్‌లలో సెంట్రల్ కమిటీ సభ్యుల సెక్యూరిటీ గార్డులు పట్టుబడటంతో పోలీసు శాఖలో హైఅలర్ట్ ప్రకటించబడింది.

కేవలం విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే 32 మంది మావోయిస్టులు అదుపులోకి రావడం సంచలనం సృష్టించింది.


ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం —
విజయవాడ పరిసర ప్రాంతాలను మావోయిస్టులు ‘షెల్టర్ జోన్’గా మార్చుకుని గత కొన్ని రోజులకు పైగా పునర్వ్యవస్థీకరణకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పలు భవనాల్లో తలదాచుకుని ఉన్న మావోయిస్టులను ఆక్టోపస్, టాస్క్‌ఫోర్స్ బృందాలు గుర్తించి అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణ జిల్లా పరిసరాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టుల చొరబాటు నివారించేందుకు అదనపు బలగాలు మోహరించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe