•పొడి పరిస్థితులకు తోడు చలి గాలులు
•10 జిల్లాల్లో 15 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు
ఈసారి చలి తీవ్రత అధికంగా ఉంటుందని
వాతావరణ నిపుణుల హెచ్చరిక
BB6 TELUGU NEWS CHANNEL
రాష్ట్రంలో చలిగజగజ వణికిస్తున్నది. వానాకాలం ఇట్ల పూర్తయ్యిందో లేదో అట్ల చలి తీవ్రత పెరిగిపోయింది. సాయంత్రం 5 గంటలనుంచే చలి గాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటల వరకూ చలి ప్రభావం ఉంటున్నది. నిజానికి ఈశాన్య రుతుపవనాలు ఈ నెల మధ్య వరకు ఉండాల్సి ఉన్నా, మొంథా తుఫాన్ ప్రభావంతో అవి త్వరగానే వెళ్లిపోయాయి.
సెప్టెంబర్ 14న నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలవ్వగా, అక్టోబర్ 15 నాటికి పూర్తిగా నిష్క్రమించాయి. ఆవెంటనే ఈశాన్య రుతుపవనాల కాలం మొదలుకాగా.. ఈ నెల మొదటివారంలోనే అవి కూడా నిష్క్రమించాయి. అక్టోబర్ 27 నుంచి మూడ్రోజుల పాటు మొంథా తుఫాను ప్రభావం ఉండగా, 30నాటికి అది బలహీనపడింది. ఆ తర్వాత రెండు మూడు రోజులు వర్షాలు పడినా,ఆ తర్వాత మాత్రం తగ్గిపోయాయి.తుఫాన్తో పాటే తేమ అంతా కూడావెళ్లిపోవడంతో రాష్ట్రంలో పొడివాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి.మరోవైపు చలి గాలులు పెరిగాయి. దీంతో గత రెండు రోజులుగా రాష్ట్రంలో చలితీవ్రత పెరిగింది. పైనున్న ఆదిలాబాద్నుంచి కిందున్న జోగులాంబ గద్వాల జిల్లా వరకూ చలి సాధారణం కన్నా ఎక్కువగా ఉంటున్నది. మరో 15 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. మరో వైపు ఈ ఏడాది గత ఏడేండ్లలో ఎన్నడూ లేనంతగా చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్ని జిల్లాల్లోనూ ప్రభావం….
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ చలిప్రభావం అధికమైంది. శుక్రవారం అన్ని జిల్లాల్లోనూ 20 డిగ్రీల లోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 10 జిల్లాల్లో15 డిగ్రీలలోపే కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా, రంగారెడ్డిలోని షాబాద్, కామారెడ్డిలోని మాచాపూర్, మెదక్ లోని మిన్పూరులో14.7 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రంభీం
ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో 14.8,
సంగారెడ్డిలోని సత్వార్లో14.8,
జగిత్యాలలో 14.8,
నిజామాబాద్ లోని జకోరాలో 14.8, సిరిసిల్లలోని గంభీరావుపేటలో 14.8, వికారాబాద్లోని నవాబ్ పేటలో 14.8, సిద్దిపేటలోని పోతారెడ్డిపేటలో 15,
నిర్మల్ లోని కుంటాలలో 15.1, నారాయణపేటలోని గుండమాల్లో 15.2,
మహబూబ్ నగర్ లోని బాలానగర్ 15.6,
మేడ్చల్ లో 15.6,
నాగర్ కర్నూల్ లోని వెల్దండలో 15.7, నల్గొండలోని సింగరాజపల్లిలో 16.6, జనగామలోని బచ్చన్నపేటలో 16.9 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఇక వనపర్తిజిల్లా పెద్దమందాడిలో 17, కరీంనగర్ లోనివెదురుగట్టులో 17, యాదాద్రిలోనిజలాల్ పూర్లో 17.1, గద్వాలలోనిమల్లాపూర్ లో 17.2,
పెద్దపల్లిలోని జూలపల్లిలో 17.3, మంచిర్యాలలోని తాండూరులో 17.3,
వరంగల్ లోని సంగెంలో 17.9 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్లోనూ చలి గజగజవణికిస్తున్నది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ప్రభావం ఉంటున్నది. సిటీ పరిధిలోని శంకర్ పల్లిలో అత్యల్పంగా 14.9డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మొయినాబాద్లో 15,
రాజేంద్రనగర్లో 15.3,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వద్ద 15.3, బీహెచ్ఎస్ఈఎల్లో 15.5,
మల్కాజిగిరిలో 15.7,
కుత్బుల్లాపూర్లో15.7,
గచ్చిబౌలిలో 15.9,
మారేడుపల్లిలో16 చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు
నమోదయ్యాయి.