వాటర్ ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

BB6 TELUGU NEWS CHANNEL
మేడ్చల్ జిల్లా, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పి.ఎస్.ఆర్. గార్డెన్స్‌లో విషాదం చోటుచేసుకుంది. పోలీసు పరేడ్ జరుగుతున్న సమయంలో ఆరోగ్యం సహకరించక పక్కన నిలబడ్డ ఏఎస్‌ఐ దేవిసింగ్ (60)ను ఓ వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. గార్డెన్స్ నుండి బయటకు వెళ్లే క్రమంలో పక్కన నిలబడ్డ ఏఎస్ఐను ఢీకొట్టిన వాటర్ ట్యాంకర్.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఎస్‌ఐ దేవిసింగ్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe