BB6 TELUGU NEWS CHANNEL
ఉత్తరప్రదేశ్.. అయోధ్య రామాలయం నిర్మాణం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రూ.3 వేల కోట్లకుపైగా విరాళాలు ఇచ్చారు. ఈ విషయాన్ని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ప్రత్యేక విషయమేంటంటే.. అయోధ్య రామాలయ ప్రాజెక్టుకి కావాల్సింది రూ.1,800 కోట్లు మాత్రమే. కానీ.. భక్తులు దాదాపు డబుల్ విరాళాలు ఇచ్చినట్లైంది. ఆలయ నిర్మాణం దాదాపు పూర్తైంది. ఇప్పటివరకూ రూ.1,500 కోట్లు ఖర్చైంది. 2022లో ఆలయ నిర్మాణం మొదలైంది. అప్పటి నుంచి విరాళాలు వస్తూనే ఉన్నాయి. నవంబరు 25న ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. ఈ వేడుకలకు దాతలందరినీ ఆహ్వానిస్తామని నృపేంద్ర తెలిపారు. ఆ రోజు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా వస్తారు. రామాలయంపై పతాకాన్ని ఎగరేస్తారు. 8 వేల మందికిపైగా దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
అయోధ్య రామాలయానికి రూ.3 వేల కోట్ల విరాళాలు..
31
Oct