అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ ₹1.2 లక్షల నగదు,5.5 తులాల బంగారం స్వాధీనం

BB6 TELUGU NEWS CHANNEL
జోగులాంబ గద్వాల జిల్లాలో పట్టపగలు దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది.
శనివారం తెల్లవారుజామున వాహనాల తనిఖీలో భాగంగా మల్దకల్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు యువకులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. విచారణలో వీరు పలు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు.
వీరి నుంచి ₹1,20,000 నగదు, 5.5 తులాల బంగారం, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం నలుగురు వ్యక్తులు పాల్గొనగా, ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు కర్ణాటకలోని రాయచూర్ జిల్లాకు చెందినవారు. నాల్గవ నిందితుడు పరారీలో ఉన్నాడు.
అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని, మళ్లీ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారణ జరుపుతామని గద్వాల డీఎస్పీ మొగిలయ్య తెలిపారు. మీడియాలో సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ టీ శ్రీనివాస్,మల్దకల్ ఎస్సై నందికర్ పాల్గొన్నారు.ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారని డీఎస్పీ తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe