BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్ మహానగరంలో తాజాగా కాల్పుల కలకలం చోటుచేసుకుంది. చాదర్ ఘాట్ ప్రాంతంలో సెల్ఫోన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఓ దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనలో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దొంగ కత్తితో దాడికి యత్నించగా..డీసీపీ స్వయంగా కాల్పులు జరిపారు. సెల్ఫోన్ స్నాచింగ్చేస్తున్న దొంగను పట్టుకోవడానికి డీసీపీ చైతన్య ప్రయత్నించారు. ఈ సమయంలో ఆ దొంగ డీసీపీ చైతన్య పై కత్తితో దాడికి యత్నించాడు. ఈ తోపులాటలో డీసీపీ గన్మ్యాన్ కిందపడటంతో, డీసీపీ చైతన్య వెంటనే గన్మ్యాన్వద్ద ఉన్న ఆయుధాన్ని తీసుకొని సెల్ఫోన్ స్నాచర్ పై కాల్పులు జరిపారు. డీసీపీ చైతన్య ఆ దొంగపై ఏకంగా మూడు రౌండ్లపాటు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దొంగకు గాయాలు కావడంతో వెంటనే అతడిని నాంపల్లి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాదులో కాల్పులు సౌత్ ఈస్ట్ డీసీపీ పై దాడికి యత్నం
25
Oct