BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిలా తాండూరు :
ముదిరాజ్ భవన నిర్మాణనికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ. వాకిటి శ్రీహరి , తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.
నియెజకవర్గ యువతకు క్రికెట్ కిట్స్ పంపీణీ.
తాండూర్ పట్టణంలోని బైపాస్ రోడ్ సమీపంలో రూ.50 లక్షల వ్యయంతో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమనికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య సంపద, క్రీడలు & యువజన సేవలు మంత్రివర్యులు శ్రీ. వాకిటి శ్రీహరి , తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మరియు ముదిరాజ్ కార్పోరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ .
ఈ కార్యక్రమంలో సోర్ట్స్ ఆథారటి చైర్మన్ శివ సేన గారు, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు, స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ మెంబర్ రమేష్ మహారాజ్ గారితో పాటు ముదిరాజ్ సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రి గారి ప్రసంగం..
తాండూర్ లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి చూపిస్తాం.
ముదిరాజ్ భవన నిర్మాణానికి పూర్తి సహాకరం అందిస్తాం.
యుతకు స్వయం ఉపాధి కోసం సెట్వీన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాం.
తాండూర్ లో మైదానం (outdoor Sports Stadium) నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయిస్తాం.
యువత చెడు వ్యసనాలు వదిలి, మైదానం బాట పట్టాలి.
ఎమ్మెల్యే బీయంఆర్ ప్రసంగం
తెలంగాణ గడ్డపై ఏ ప్రాంతంలో అడుగుపెట్టిన,
పోరాట స్ఫూర్తి, సాంస్కృతి సంప్రదాయాలు, ఉద్యమ చరిత్రలు స్వాగతం చెబుతాయి.
తెలంగాణలో మరియు తాండూర్ లో బీసీలలో సంఖ్యాపరంగా అధికులైన ముదిరాజులు, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో ముదిరాజుల పాత్ర కీలకమని తాండూరు ఎమ్మెల్యేగా నా గెలుపే దానికి నిదర్శనం.
2023 నవంబర్ 24న వందలాది మంది ముదిరాజ్ బిడ్డలందరూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకై కదంతొక్కి నాకు అండగా నిలబడ్డారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే తాండూర్ నియోజకవర్గంలో ముదిరాజ్ భవనం ఏర్పాటుకు కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ముదిరాజ్ భవన్ కు శంకుస్థాపన చేసుకున్నాం.
ఇది కేవలం ఒక్క ముదిరాజ్ భవన్ శంకుస్థాపన మాత్రమే కాదు.
భవిషత్తులో ఈ భవనం ముదిరాజ్ ల ఆత్మగౌరవానికి ప్రతిక కావాలి.
జనాభాలో సగభాగం ఉన్న బీసీలు, బీసీలలో అధిక భాగం ఉన్న ముదిరాజ్ లు విద్య, ఉద్యోగాలు, రాజ్యాధికారం కోసం బీసీ, ముదిరాజ్ సంఘాలు ఉద్యమాలు చేస్తూనే వస్తున్నాయి.
కానీ గత ప్రభుత్వాలు బీసీలను, ముదిరాజ్ లను పట్టించుకోలేదు.
ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో పదేళ్ళ కాలంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేకపోయారు.
పదేళ్ళలో పాలన ఫామ్ హౌస్ కే పరిమితం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలన అనే పద్దతిలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుంది.
తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్న ముదిరాజ్ వర్గం నుండి శ్రీహరి అన్నకు మంత్రి పదవి, మన నియోజకవర్గం నుండి రమేష్ మహారాజ్ గారికి కార్పోరేషన్ మెంబర్, పార్టీ పరంగా అనిల్ కు యూత్ ప్రైసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించడం జరిగింది.
గతంలో అభివృద్ధి అంటే తెల్ల కాగితాలకే పరిమితం అయ్యింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపిస్తుంది.
ఇప్పుడు మన సభ స్థలం ముదిరాజ్ లకు,దీని ప్రక్కన యాదవ కుర్వ సోదరులకు స్థలన్ని కేటాయించడం జరిగింది.
తాండూర్ మెకానిక్ అసోసియేషన్ వాళ్ళ చిరకాల స్వప్నం అయిన ఆటో నగర్ ఏర్పాటు చేయడం జరిగింది.
గత ప్రభుత్వంలో మంజూరైన బైపాస్ రోడ్ నత్తనడకన పనులు ఆగిపోవడం జరిగింది.
మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పాటయినా తర్వాత బైపాస్ రోడ్ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడంతో రూ.108 కోట్ల రూపాయలు మంజూరు చేయ్యడం జరిగింది.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ATC సెంటర్ ను ప్రారంభించుకోవడం జరిగింది..
