రియాజ్ మృతదేహానికి అర్ధరాత్రి2 గంటలకు పోస్టుమార్టం పూర్తి..ఎన్ కౌంటర్ వరకూ ఏం జరిగిందంటే..

BB6 TELUGU NEWS CHANNEL
నిజామాబాద్: నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ అంత్యక్రియలు ముగిశాయి. అర్ధరాత్రి 2 గంటలకు పోస్టుమార్టం పూర్తయింది.పోస్టుమార్టం తర్వాత బంధువులకు మృతదేహం అప్పగించారు. రియాజ్ బంధువులు తెల్లవారుజామున అంత్యక్రియలు పూర్తి చేశారు. అక్టోబర్17న కానిస్టేబుల్ ప్రమోద్ రియాజ్ కత్తితో దాడి చేసి చంపిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసునిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో ఏఆర్ కనిస్టేబుల్ నుంచి రియాజ్ గన్నులాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి.రియాజ్ పై తప్పనిసరి పరిస్థితుల్లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులపై రియాజ్ కాల్పులు జరపబోయాడని, ఆస్పత్రిలో రూమ్బయట ఉన్న ఏఆర్ పోలీసుల గన్లాక్కునే ప్రయత్నం చేశాడని, రియాజ్ గన్ఫైర్ చేసి ఉంటే చాలా ప్రాణాలు పోయేవని, ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారని – డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు.

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ను కాపాడేందుకు పోలీసు శాఖ నిబద్ధతతో ఉందని, ఎలాంటి నేరస్తులను అయినా అణచివేస్తామని డీజీపీ హెచ్చరించారు.కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్రేషియా ప్రకటించారు. ఆకుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు 300 గజాల ఇంటి స్థలం ఇస్తామని-డీజీపీ శిశధర్ రెడ్డి వెల్లడించారు. రియాజ్ అరబ్ ఎన్ కౌంటర్ వరకూ జరిగింది ఇది..

నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ ను హత్య చేసిన రియాజ్ అరబ్ ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు.

నిజామాబాద్ నగర శివారులోని ఓపాత లారీ క్యాబిన్లో దాక్కున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.కానిస్టేబుల్ ను చంపి పారిపోయిన రియాజ్ ను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేయడంతో ఎక్కడికక్కడ గాలింపు ముమ్మరం.

నిజామాబాద్ శివారులోని బాబన్స పహాడ్, సారంగాపూర్ ఏరియాలో రియాజ్ ఉన్నట్లు తెలియడంతో పోలీసుల ఫోకస్..ఈ విషయం తెలుసుకున్న రియాజ్ శనివారం రాత్రి పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని నగర శివారులోని ఓరియల్ ఎస్టేట్ వెంచర్క సమీపంలో ఉన్న పాత లారీ క్యాబిన్లో దాక్కున్నాడు. ఆదివారం ఉదయం సమాచారం
అందుకున్న పోలీసులు అటువైపు వెళ్లారు పోలీసుల రాకను గమనించిన రియాజ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు* దగ్గర్లోనే ఉన్న బైక్ మెకానిక్ ఆసిఫ్ పట్టుకున్నాడు. దీంతో రియాజ్ కత్తితో ఆసిఫ్ ను గాయపర్చాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరగడంతో రియాజ్ కు గాయాలు.ఇదే టైంలో అక్కడుకు చేరుకున్న పోలీసులు రియాజ్ ను అదుపులోకి తీసుకొని ట్రీట్మెంట్ కోసం తమ వాహనంలో జీజీహెచ్కు తరలింపు.అక్కడి నుంచి తప్పించుకు నేందుకు వీలు లేకుండా సాయుధ పోలీసులను నియమించారు

రియాజ్ను పట్టుకోబోయి గాయపడిన ఆసిఫ్ కు ట్రీట్ మెంట్ ఇప్పించి పంపించారు.

తనను ఎన్ కౌంటర్ చేస్తారని ప్రచారం జరగడంతో.

తాను ఉన్న ప్రతీ ప్లేసు కొద్దిదూరంలో తన గ్యాంగ్ లోని ఓసభ్యుడిని పెట్టిన రియాజ్.

పోలీసులు తనను పట్టుకోగానే వీడియో తీసి వైరల్ చేయాలని సూచించిన రియాజ్

ఆ క్రమంలోనే రియాజ్ పట్టుబడిన వీడియో వైరల్ నిజామాబాద్‌లో రియాజ్ ఎన్ కౌంటర్ ప్రభుత్వాస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ను లాక్కునే ప్రయత్నం చేసిన రియాజ్. కానిస్టేబులు తీవ్రగాయాలు..రియాజ్ పై కాల్పులు జరిపిన పోలీసులు..కాల్పుల్లో రియాజ్ మృతి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe