BB6 తెలుగు NEWS : బావిలో పడి మరణించిన నల్లగొండ రిషిక్ (17) తల్లిదండ్రులు నల్లగొండ నాగరాజు స్వాతి తన కుమారుడి మరణం లోను మానవత్వం చాటారు. స్నేహితులంతా కలిసి ఓచోట గడిపేందుకు వెళ్లిన మరో క్షణంలోనే విషాదం చోటుచేసుకుని ఇద్దరు స్నేహితులు మరణించిన సంగతి తెలిసినదే, పుట్టెడు దుఃఖంలో ఉన్నటువంటి రిషిక్ తల్లిదండ్రులు తన కుమారుడు నేత్రాలను లైన్స్ క్లబ్ కు దానం చేశారు. తన కుమారుడి నేత్రాల ద్వారా మరొకరి చూపు రావాలని కోరుకున్నట్లు మీడియాకు తెలిపారు. కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే మేము సైతం ఎంతో సంతోషంగా ఉంటామన్నారు. అనంతరం పట్టణంలో నిర్వహించిన అంత్యక్రియల్లో మాజీ జెడ్పిటిసి సభ్యులు దూదిమెట్ల సతయ్య యాదవ్, జాల సైదులు మంజుల, మేడబోయిన రాంబాబు యాదవ్, జక్కల వెంకన్న, లింగాల రమేష్, ప్రజ్ఞా పురం కృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
మరణం లోను మానత్వాన్ని చాటారు.. నార్కట్పల్లి
06
Oct