తాండూర్ మైనారిటీ సమస్యలపై చర్చించడానికి పి.ఏ ద్వారా ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత.

BB6 TELUGUNEWS : Riyaz : తాండూరు పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కుల పోరాట సమితి,  తాండూర్ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో, తాండూర్ నియోజకవర్గంలోని మైనారిటీల సమస్యలపై ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి తో ప్రత్యక్షంగా సమావేశం కావాలన్న వినతిపత్రం తాండూర్ ఎమ్మెల్యే  క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.ఈ వినతి పత్రాన్ని ఎమ్మెల్యే కి వ్యక్తిగత సహాయకుడికి పి.ఏను అందజేశారు. మైనారిటీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే  దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తాండూర్ నియోజకవర్గ ఇంచార్జ్ మొహమ్మద్ సాధిఖ్.వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాదర్. అధికార ప్రతినిధి మొహమ్మద్ అంజాద్.తాండూర్ మండల అధ్యక్షుడు డాక్టర్ మాఖదూమ్.ప్రధాన కార్యదర్శి ఇస్మాయిల్.పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫర్హాత్ హుస్సేన్. ఉపాధ్యక్షులు వాసే. తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe