* *కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం.. అక్టోబర్లోనే లోకల్ బాడీ ఎలక్షన్స్!*
* *మహిళా రిజర్వేషన్ల కోసం లక్కీ డ్రా..త్వరలోనే బీసీ రిజర్వేషన్లపై జీవో*
* *డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీలకు 42% కోటా.. ఎస్సీలకు 15% , ఎస్టీలకు 10%*
BB6 TELUGU NEWS CHANNEL
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.ఈ ప్రక్రియను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలని సూచించింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని స్పష్టం చేసింది. ఎస్సీలకు15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల చొప్పున ఖరారు చేయాలని తెలిపింది.వార్డులకు గ్రామం యూనిట్గా.. ఎంపీటీసీ,సర్పంచ్ స్థానాలకు మండలం యూనిట్. జెడ్పీటీసీకి జిల్లా యూనిట్ గా రిజర్వేషన్లు ఫైనల్ చేయనున్నారు. ఈమేరకు సీఎస్ రామకృష్ణారావు ఆదివారం జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టంచేశారు. వారంలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో ఇస్తుందని,ఆలోపు రిజర్వేషన్లు కంప్లీట్ చేసి పబ్లిష్ చేసేందుకు రెడీగా ఉండాలని సీఎస్ సూచించినట్లు తెలిసింది. ఈ నెల 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టుగడువు విధించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను చేపడ్తున్నది. గడువులోగా ఎలాగో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నామని, అక్టోబర్ లో ఎన్నికలు పూర్తి చేస్తామని, ఇదే క్రమంలో కొంత గడువు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ వేయనున్నట్లు తెలిసింది.
