BB6 TELUGU NEWS CHANNEL
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, మాచవరం మండలం, మాచవరం గ్రామంలోని మునుసుబు కళ్యాణ మండపం నందు మాచవరం మండలంలోని మండల స్థాయి ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశంలో మరియు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్) కార్యక్రమాల్లో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, ఆర్డీవో మురళీకృష్ణ , మాచవరం మండల తహసీల్దార్, మరియు మండల స్థాయిలోని అన్ని డిపార్ట్మెంట్లకు చెందిన సంబంధిత అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాచవరం మండలంలోని అన్నీ గ్రామాల ప్రజల నుండి సమస్యల వినతి పత్రాలను స్వీకరించి పరిష్కారం కొరకు సంబంధిత అధికారులకు పంపడం జరిగింది. అనంతరం డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
