కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సమస్యలపై సెప్టెంబర్ 7న హైదరాబాద్ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ

BB6 TELUGU NEWS : Tirupati:
దేశంలో రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ కార్మికుల ను పర్మనెంట్ చేయాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని సమాన పనికి సమావేశం చెల్లించాలని కోరుతూ ఈ నెల 7న ఐ ఎఫ్ టీ యు ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నందు జరిగే రాష్ట్రస్థాయి సదస్సు జయప్రదం చేయాలని కోరుతూ రామగుండం లో  పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.
     ఈ సందర్భంగా *హమాలి సంఘం (ఐ ఎఫ్ టి యు) గౌరవ అధ్యక్షులు కొల్లూరి మల్లేష్* మాట్లాడుతూ రాష్ట్ర,కేంద్ర సర్వీసులలో సుమారు 25 లక్షల మంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల పని చేస్తున్నారని వారికి కనీస వేదనాల చట్టం అమలు కావడం లేదని ఆయన అన్నారు. ఈ రాష్ట్రంలో సింగరేణి, గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ విద్యుత్,విద్య,వైద్య, రంగాలలో,ఈ రాష్ట్రంలో లక్షలాదిమంది కార్మికులు పనిచేస్తున్నారని వారిని పరిమినెంట్ చేయాలని ఆయన అన్నారు. ఎన్నికల హామీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం కనీస వేతన చట్టం అమలు చేయాలని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వ్యవస్థను పర్మినెంట్ చేయాలని వారన్నారు.నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 లేబర్ చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని దీనివలన కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని వారన్నారు ఎనిమిది గంటల పని విధానం పోయి 12 గంటల పని విధానం బ్రిటిష్ చట్టాలు అమలులోకి తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వాలు పన్నాగాలు పన్నుతున్నాయని వారన్నారు.
    ఈ దేశంలో పర్మినెంట్ వ్యవస్థ పోయి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వ్యవస్థ పెరిగిపోయిందని పెరిగిన ధరలకు అనుగుణంగా సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వీరి పని విధానాలలో,వేతనాలలో మార్పులు రావడం లేదని పారిశ్రామికవేత్తలకు కార్పొరేషన్ రోజువారీగా బతికే కార్మిక వర్గానికి కనీస వేతనం ఇచ్చే పరిస్థితి లేదని పిఎఫ్ ఎస్ఐ లాంటి సౌకర్యాలను కల్పించే పరిస్థితులు ఈ ప్రభుత్వాలు లేవని వారన్నారు ఈ సమస్యల పరిష్కారం కోసం ఐ ఎఫ్ టీ యు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సెప్టెంబర్ 7న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నందు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని దీనికి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
    ఈ కార్యక్రమంలో  ఐ ఎస్ టి యు, సీ పీ ఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ, ఐ ఎఫ్ టీ యు జిల్లా నాయకులు పైడిపల్లి రమేష్, సమ్మెట తిరుపతి, కె మహేందర్,గొట్టే శంకర్, ఈదునూరి బాబు, కృష్ణ.తదితరులు పాల్గొన్నారు.

*కొల్లూరి మల్లేష్*
గౌరవ అధ్యక్షులు హమాలి సంఘం (IFTU)రామగుండం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe