ఉమ్మడి జిల్లాలో 12 లక్షలకు చేరిన కార్డులు
23,030 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపు
కొత్త లబ్ధిదారుల్లో ఆనందం
BB6 TELUGU NEWS CHANNEL
జనగామ : మూడు నెలల తర్వాత నేటి నుంచి మళ్లీ రేషన్ పంపిణీ షురూ కానుంది. జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి జూన్లో పంపిణీ చేశారు. ఏండ్లుగా ఎదురు చూసిన రేషన్ కార్డుల జారీని ప్రస్తుత సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కార్డుల సంఖ్య 12లక్షలకు చేరింది. ఉమ్మడి జిల్లాలో 2,305 రేషన్ దుకాణాలుండగా అన్నింటి పరిధిలో కొత్తగా లక్షకు పైగా కార్డులు వచ్చి చేరాయి.
23,030 కేటాయింపును ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ,హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్,ములుగు, జయశంకర్ భూపాలపల్లిజిల్లాల్లో రేషన్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నారు. ఈ జిల్లాల్లో గత మేనెల వరకు 11,12,620 రేషన్ కార్డులుఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య12,16,008కి చేరాయి. కొత్త కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. లబ్ధిదారుల సంఖ్య 36,17,604కు పెరిగింది. వీరికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నారు.ఇందు కోసం 23,030 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సర్కారు అలాట్ చేయగా రేషన్దు కాణాలకు చేరింది.
జనగామ జిల్లాలో 335 రేషన్ షాపులుండగా 3,470 మెట్రిక్ టన్నుల బియ్యం అలాట్ అయ్యాయి. హన్మకొండజిల్లాలో 413 దుకాణాలుండగా 4676టన్నులు, వరంగల్ జిల్లాలో 500దుకాణాలుండగా 5382 టన్నులు,మహబూబాబాద్ జిల్లాలో 558 దుకాణాలుండగా 5127 టన్నులు,భూపాలపల్లిలో 277 దుకాణాలుండగా 2495 టన్నులు, ములుగు జిల్లాలోని 222రేషన్ దుకాణాలుండగా 1880 టన్నుల బియ్యం అలాట్ కాగా పంపిణీ చేయనున్నారు. దీంతో కొత్తగా రేషన్తీసుకోనున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చాలా ఆనందంగా ఉంది : మాది జనగామజిల్లా పాలకుర్తి మండలం బీక్యానాయక్తండా పంచాయతీ పరిధిలోని దంతెలగడ్డతండ. పెండ్లి నాలుగేండైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత సర్కారు టైంలో కొత్తరేషన్ కార్డుకోసం దరఖాస్తు చేసుకున్నారాలేదు. ఎన్ని సార్లు అడిగినా అధికారులు పట్టించుకోలేదు. కాంగ్రెస్ సర్కారు రాగానేమళ్లీ దరఖాస్తు చేస్తే రేషన్ కార్డు వచ్చింది.ఈ నెల నుంచి సన్నబియ్యం కూడా ఇస్తామంటున్నరు. చాలా ఆనందంగా ఉంది.- బానోత్ అనిత, కొత్త రేషన్ కార్డులబ్ధిదారురాలు పదేండ్లు ఎదురు చూసిన :మాది జనగామజిల్లా బచ్చన్నపేట మండలంలోని ఆలింపూర్. నాకు పెళ్లయి 16సంవత్సరాలు అవుతోంది. 14, 7 యేండ్ల వయస్సున్న ఇద్దరు కొడుకులున్నరు.పదేండ్ల నుంచి రేషన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న. అప్పటి సర్కారు
పట్టించుకోలేదు. మా కుటుంబ సభ్యులు నలుగురి పేరుతో రేషన్ కార్డు మంజూరైంది. ఎలికట్టె సురేశ్ గౌడ్,లబ్దిదారుడు…