BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని నిర్ణయించింది. పంచాయతీ రాజ్ చట్టం 2018 సవరణకు ఆమోదం తెలిపిన కేబినెట్.. రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. అసెంబ్లీ తర్వాత ప్రత్యేక జీవో తెచ్చి కులగణన
ఆధారంగా తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తోంది.
సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో కేబినెట్ కోనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, సీఎస్ రామకృష్ణరావు, మంత్రులు హాజరయ్యారు.తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరో నెల రోజుల్లో జరపాలని కోర్డు ఆదేశించింది. మొత్తం రిజర్వేషన్ల పరిమితి50 శాతానికి మించకూడదని గత ప్రభుత్వం 2018 ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనిపై ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసి గవర్నర్ కుపంపింది. ప్రస్తుతం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది. ముస్లీం కోటా పేరుతో బీజేపీ బిల్లును అడ్డుకుంటోంది. రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా ప్రధాని మోదీ సర్కార్ అడ్డుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలపాలని ఢిల్లీలో నిరసన కూడా తెలిపింది తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణలో రిజర్వేషన్ కోటా పరిమితి ఎత్తివేతకేబినెట్ సంచలన నిర్ణయం
30
Aug