BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం :
నానో యూరియా వాడడం వల్ల పంట అధిక దిగబడి ఉంటుంది అని AO నరేందర్, PACS చైర్మన్ లక్ష్మీనారాయణ అన్నారు, సాధారణ యూరియా కంటే నానో యూరియా వాడడం వల్ల వ్యవసాయానికి సులభతరం చేసుకోండి అని రైతులకు సూచించారు. సాధారణ యూరియా యొక్క 45 కేజీల బస్తాకి బదులుగా నానో యూరియా 500 మి లీ సరిపోతుంది అని సూచించారు. సాధారణ యూరియా ఎకరాకు రెండు బస్తాలు అవసరమైతే నానో యూరియా 500 మి లీ సరిపోతుందని మరియు నానో యూరియా పంటపై నేరుగా పిచికారి చేస్తాం కాబట్టి పంట యొక్క అన్ని భాగాలకు అంది సులభంగా చేరుతుందని తెలిపారు. పగిడియల్ గ్రామానికి చెందిన రైతు బంగారు కృష్ణయ్య, రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు సండ్రస్ రాములు, లింగాయపల్లి గ్రామానికి చెందిన యువ రైతు హనుమన్ పల్లి భాస్కర్ మరియు ఇతర రైతులు నేరుగా ముందుకు వచ్చి నానో యూరియాను కొనుగోలు చేశారు.
నానో యూరియా వాడడం వల్ల అధిక లాభాలు ఉమ్మడి గండీడ్ మండల ఏవో నరేందర్.

23
Aug