వీధికుక్కలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయంస్టే విధిస్తు విచారణకు ఆదేశం

BB6 TELUGU NEWS ..14 Aug 2025 :
ఢిల్లీ-NCRలో వీధి కుక్కలను తొలగించాలన్న ఆదేశంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ స్టే విధించింది. స్థానిక అధికారులు వాళ్ళ బాధ్యతలను నిర్వహించడం లేదని,దీనికి సంబంధించి కోర్టులో హాజరు కావాలని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ కోడి మాంసం,గుడ్లు తింటూ జంతు ప్రేమికులమని చెప్పుకుంటున్నారు, ఇది పరిష్కరించాల్సిన సమస్య.. పిల్లలు చనిపోతున్నారు,స్టెరిలైజేషన్ రేబిస్ వ్యాధిని ఆపదు. కుక్కకాటు వల్ల రేబిస్ మరణాల లెక్కలను చూడండి అంటూ ధర్మాసనానికి తెలిపారు.ఆగస్టు 11న సుప్రీంకోర్టు జస్టిస్ లు జెబిపార్దివాలా, ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం ఢిల్లీ-ఎన్సీఆర్ లోని అధికారులు అన్ని ప్రాంతాలలో వీధికుక్కలను త్వరగా డాగ్ షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. వీధి కుక్కలపట్ల ప్రజలకు నిజమైన ప్రేమ, సంరక్షణ పట్ల అవగాహన ఉందని ధర్మాసనం తెలిపింది.
ఇంతకు ముందు ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD), న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC), నోయిడా,ఘజియాబాద్, గురుగ్రామ్, ఫరీదాబాద్లో వీధి కుక్కలను పట్టుకోవడం ప్రారంభించాలని, ఇందుకు వెంటనే డాగ్షెల్టర్లు ఏర్పాట్లు చేయాలనీ, ఎనిమిది వారాల్లోగా మౌలిక సదుపాయాల గురించి రిపోర్ట్ చేయాలనీ ఆదేశించింది.ఈ ఆదేశానికి వ్యతిరేకంగా జంతు హక్కుల సంఘాలు, కార్యకర్తల నిరసనతో ఢిల్లీ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా,హీరోయిన్ జాన్వీ కపూర్, వరుణ్ ధావన్,సినీ నిర్మాత సిద్ధార్థ్ ఆనంద్ సహా చాలమంది రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ తీర్పు పై అసంతృప్తిని వ్యక్తం చేశారు.ఇవాళ గురువారం వీధికుక్కల కేసుపై నిరసనల నేపథ్యంలో విచారణ జరపడానికి సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటుచేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe