రెడ్‌ అలర్ట్‌ : తెలంగాణ అంతటికీ ఇవాళ, రేపు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు

BB6 TELUGU NEWS  13 Aug 2025 :
హైదరాబాద్‌: తెలంగాణ అంతటికీ ఇవాళ, రేపు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్‌ కలర్‌ వార్నింగ్‌ జారీ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌, హనుమకొండ, ఆదిలాబాద్‌, జనగామ, కామారెడ్డి, కుమురం భీం, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ కలర్‌ వార్నింగ్‌ జారీ చేసినట్లు చెప్పారు.

తెలంగాణలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరిక.

*హైడ్రా కమీషనర్ రంగనాథ్ కీలక సూచనలు..*

* ఏబీఎన్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.
* సాయంత్రం నుంచి ఎల్లుండి వరకు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
* ఎంతటి విపత్తు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.
* జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, జలమండలి, విద్యుత్ అధికారుల సమన్వయంతో పని చేస్తున్నాం.
* లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీళ్లు వస్తే పబ్లిక్‌ను రెస్క్యూ చేయడానికి బోట్స్‌తో సహా అన్ని ఎక్విప్‌మెంట్స్ సిద్ధంగా పెట్టుకున్నాం.
* రాత్రి సమయంలో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశాలుండటంతో ఈరోజు రాత్రి హైడ్రా టీమ్స్ అందుబాటులో ఉంటాయి.
* నాలాల కబ్జాలతో రోడ్లపై వరద నీళ్లు వస్తున్నాయి.
* ఓఆర్ఆర్ పరిధిలో 400 కి పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి.
* మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఇప్పటికే సిబ్బంది ఉన్నారు.
* అత్యవసరమైతే తప్ప పబ్లిక్ బయటకి రావొద్దు.
* ఒకవేళ భారీ వర్షాలు వస్తే యూత్ కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరుతున్నాను.

హైదరాబాద్: రేపు ఐటీ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. ఐటీ ఉద్యోగులకు రేపు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలని ఐటీ కంపెనీలను కోరిన సైబరాబాద్ పోలీసులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe